ఐపీఎల్ మొదలయ్యేది ఎప్పుడంటే..?

-

ప్రతీ సంవత్సరం వేసవిలో క్రికెట్ జాతర గురించి అందరికీ తెలిసిందే. ఐపీఎల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. 2020లో కరోనా కారణంగా ఆలస్యంగా మొదలైన ఐపీఎల్ అట్టహాసంగానే ముగిసింది. ప్రస్తుతం 2021లో ఐపీఎల్ 14వ సీజన్ మొదలవబోతుంది. ఈ మేరకు ఇప్పటికే ఆటగాళ్ళ వేలం జరిగిపోయింది. దాంతో ఐపీఎల్ ఎప్పుడు ఉండనుందనే విషయం చర్చల్లోకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 11వ తేదీ నుండి మొదలవనుందని తెలుస్తుంది.

ముంబై, అహమ్మదాబాద్ నగరాల్లో మాత్రమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఎక్కువ లొకేషన్లలో నిర్వహించడం లేదు. ఈ సారి యాభై రోజుల పాటు ఐపీఎల్ జరగనుంది. మొత్తం యాభై ఆరు లీగ్ మ్యాచులతో పాటు మిగతా నాలుగు మ్యాచులు జరగనున్నాయి. జూన్ మొదటి వారంలో ఐపీఎల్ ఫైనల్ ఉండనుంది. మరి దీనిపై అధికారికంగా షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news