ఐపీఎల్‌ :మరో స్ట్రాంగ్‌ ఫైట్‌కు సిద్దమైన అబుదాబీ…!

-

ఐపీఎల్‌ 2020సీజన్‌ మరో స్ట్రాంగ్‌ ఫైట్‌కు వేదిక కానుంది . అబుదాబీ వేదికగా రోహిత్‌ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌.. స్టీవ్‌ స్మిత్‌ సారథ్యంలోని రాజస్థాన్‌ రాయల్స్‌తో పోరుకు సిద్ధమైంది. మూడు విజయాలతో రోహిత్‌ సేన సూపర్‌ ఫామ్‌లో ఉంది. మరోవైపు రాజస్థాన్‌ వరుస రెండు ఓటములతో డీలా పడింది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని ముంబై భావిస్తుండగా.. మళ్లీ గెలుపు ట్రాక్‌లో రావాలని రాజస్థాన్‌ ఉవ్విళ్లూరుతోంది.

ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌ మూడింటిలో విక్టరీ కొట్టింది. ఇక రాజస్థాన్‌ రాయల్స్‌ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలను నమోదు చేసింది. ఇరు జట్లలో పవర్‌ఫుల్‌ హిట్టర్లున్నారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ముంబై ఇండియన్స్ జట్టుపై మంచి రికార్డు ఉంది. స్మిత్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌లతో రాజస్థాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ స్ట్రాంగ్‌ హిట్టర్లు తమ బ్యాటిక్‌ పని చెబితే భారీ స్కోరు ఖాయం. ఇక రాహుల్ తేవటియా ఆఖర్లో బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇది రాజస్థాన్‌కి ప్లస్‌ పాయింట్‌. రాజస్థాన్‌కి బౌలింగ్‌ ఎటాక్‌కు లీడర్‌ జోఫ్రా ఆర్చర్‌. ఈ ఇంగ్లండ్‌ పేసర్‌ బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. 145 కి.మీలకు తగ్గకుండా బంతులేస్తున్నాడు. అయితే ఆర్చర్‌కి తోడుగా నిలిచే మరో బౌలర్‌ లేకపోవడం రాజస్థాన్‌కి మైనస్‌ పాయింట్‌.

ఇక రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై జట్టు కూడా పటిష్టంగా ఉంది. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మలు తమ బ్యాటుకు పనిచేబితే పరుగుల వరద పారుతుంది. అంతేగాక, పాండ్యా సోదరులు, కీరన్ పోలార్డ్‌లు బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు. ఈ సీజన్‌లో అన్ని టీమ్‌ల కన్నా ముంబై టీమ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ భీకరంగా ఉంది. పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య చెలరేగితే ముంబై భారీ స్కోరు సాధించడం ఖాయం. ముంబై బౌలింగ్‌ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బుమ్రా, జేమ్స్‌ పాటిన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ వంటి వరల్డ్‌ క్లాస్‌ ఫాస్ట్ బౌలర్లు ముంబైకి ఉన్నారు. ఈ ముగ్గురి రాణించడంతో ముంబై తమ టార్గెట్‌లను కాపాడుకుంటోంది.

ఇప్పటి వరకు జరిగిన పోరుల్లో ఇద్దరు సమఉజ్జీలుగా ఉన్నారు. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 23 సార్లు తలపడగా.. రాజస్థాన్‌, ముంబై చెరో 11 మ్యాచ్‌ల్లో గెలిచాయ్‌. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Read more RELATED
Recommended to you

Latest news