ipl 2022: 25 శాతం ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి… బీసీసీఐ నిర్ణయం

-

క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 26న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కాబోతోంది. వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య ముంబై వాంఖడే స్టేడియం వేదిగా తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఫ్యాన్స్ అంతా ఐపీఎల్ ప్రారంభం కోసం చూస్తున్నారు. ఇదిలా ఉంటే గత రెండు సీజన్లుగా ఐపీఎల్ స్వదేశంలో జరగలేదు. కరోనా కారణంగా యూఏఈ వేదికగా మ్యాచ్ లు జరిగాయి. దీంతో ఫ్యాన్స్ ఐపీఎల్ ను చాలా మిస్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 25 మంది ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఈసారి కొత్తగా లక్నో, అహ్మదాబాద్ జట్లు కూడా ఐపీఎల్ లోకి రానున్నాయి. దీంతో ఐపీఎల్ జట్ల సంఖ్య 10కి చేరింది. ఒక్కో జట్టు లీగ్ దశలో మొత్తం 14 మ్యాచులు ఆడనుంది. ముంబాయి, పూణేల్లో నాలుగు స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచులు జరగనున్నాయి

Read more RELATED
Recommended to you

Latest news