IPL 2022 : నేడు ఢిల్లీతో తలపడనున్న ముంబై..టెన్షన్ లో బెంగళూరు

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 69 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖాడే స్టేడియం లో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి వైదొలగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే.. ప్లే ఆఫ్స్‌ కు చేరనుంది. ఓడిపోతే.. బెంగళూరు ప్లే ఆఫ్స్‌ కు చేరుతుంది. దీంతో ముంబై గెలవాలని ఆర్సీబీ ఫ్యాన్స్‌ ప్రార్థనలు చేస్తున్నారు.

జట్ల అంచనా

ఢిల్లీ క్యాపిటల్స్ : సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (WK), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, ఖీల్ అహ్మద్

ముంబై ఇండియన్స్ : ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, రమణదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, జయదేవ్ ఉనద్కత్/అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్