లక్నో జట్టును బెంగళూరు చిత్తు చేసింది. లక్నోతోజరిగిన మ్యాచ్ లో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 182 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. .. 163 పరుగులకే పరిమితమైంది. దీంతో విజయం బెంగళూరును వరిచింది. పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ… మరోసారి డికాక్ విఫలం అయ్యాడు. 3 పరుగులకే డికాక్ ఔట్ అయ్యాడు. మనీష్ పాండే మళ్లీ నిరాశ పరిచాడు.
రాహుల్ కాసేపు నిలిచినా.. ఆశించిన వేగంతో పరుగులు చేయలేకపోయాడు. అయితే..ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్య, దీపక్ కూడడా మెరుగైన భాగస్వామ్యంతో.. స్కోర్ బోర్డును నడిపించారు. అయితే.. ఒత్తిడి బ్యాట్స్‌మెన్స్ వికెట్లు పడేసుకున్నారు. ఇక అంతకు ముందు.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలోఆరు వికెట్ల నష్టానికి 181 పరుగుల చేసింది. దీంతో లక్నో కు 182 పరుగులను లక్ష్యంగా నిర్ధేశించింది. బెంగళూఉ కెప్టెన్ డెప్లెసిస్ 96 పరుగులు చేసి.. వెనుదిరిగాడు. హజిల్ వుడ్ 4 వికెట్లు తీసి.. షభాష్ అనిపించాడు.