IPL 2022 : ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ బౌలర్ చెత్త రికార్డ్

-

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. నిన్న హైదరాబాద్ జట్టుపై జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన గుజరాత్ జట్టు… ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో తీవేటియ, రషీద్ ఖాన్ మెరవడం తో గుజరాత్ విజయం సాధించింది. అయితే.. హైదరాబాద్ యువ బౌలర్ మార్కో జాన్సన్ ఈ మ్యాచ్ లో తన స్పెల్ లో ఏకంగా 63 పరుగులు ఇచ్చాడు.

ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు చెన్నై బౌలర్ లుంగీ ఎంగిడీ పేరిట ఉండేది. 2019లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో 62 పరుగులు ఇచ్చాడు.

ఇక నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ జాన్సన్ తన మొదటి స్పెల్ అయినా రెండు ఓవర్లలోనే 18 పరుగులు ఇచ్చాడు. ఇక చివరి ఓవర్ లో 22 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో తన నాలుగు ఓవర్ల స్పెల్ లో 63 పరుగులు ఇచ్చి… కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news