అనుభవమున్న ఆ ఇద్దరు ఆటగాళ్లను ఓపెనర్ గా పంపండి – అజిత్ అగర్కర్

ఇంగ్లాండ్ తో జూలై 1 న ప్రారంభం కానున్న 5వ టెస్ట్ కు టీమిండియా ఓపెనర్ గా చతేశ్వర్ పూజారా, లేదా హనుమ విహారి ని పంపాలని భారత మాజీ పేసర్ అజిత్ అగర్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ కీలక మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అతడు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాడు. దీంతో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు రోహిత్ దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ ను ఎవరు ప్రారంభిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అయితే పూజారా, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, కెఎస్ భరత్ వంటివారు ఓపెనింగ్ రేసులో ఉన్నారు.” వామప్ మ్యాచ్ లో కెఎస్ భరత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు అని మనకు తెలుసు. కానీ అతనికి ఉన్న అనుభవం తక్కువే. కాబట్టి రోహిత్ లాంటి సీనియర్ ఆటగాడు అందుబాటులో లేని కారణంగా.. పూజారా లేదా విహారీ లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తే బాగుంటుంది. ఇది కీలక మ్యాచ్ కాబట్టి అనుభవం ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇస్తే మంచిది”. అని అజిత్ అగర్కర్ పేర్కొన్నాడు.