భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్‌తో కలిసి మొత్తం 5 టెస్టులను భారత్ ఆడనుంది. ఈ క్రమంలోనే బుధవారం నాటింగామ్ మైదానంలో మొదటి టెస్టు ప్రారంభం అవుతుంది. ఇక ఈ సిరీస్ కోసం భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే ఆటగాళ్లు ఇప్పటికే నెట్స్ లో విపరీతంగా శ్రమిస్తున్నారు.
ఇక టెస్టుల్లో విదేశీ గడ్డపై గత 2 ఏళ్లుగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 2019 నుంచి అతను భారత గడ్డపై 9 టెస్టులు ఆడి 62.50 సగటు, 2 సెంచరీలతో 625 పరుగులు చేశాడు. కానీ విదేశీ గడ్డపై కోహ్లి 7 మ్యాచ్‌లలో కేవలం 25.53 సగటులో 332 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఒక్క టెస్టు సెంచరీని కూడా నమోదు చేయలేదు. దీంతో కోహ్లి ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డపై ఎలాంటి ప్రదర్శనను ఇస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
కోహ్లి 2019లో కోల్‌కతాలో బంగ్లాదేశ్ తో జరిగిన డే నైట్ టెస్టులో చివరి సారిగా సెంచరీ చేశాడు. మళ్లీ ఇప్పటి వరకు సెంచరీ చేయలేదు. అయితే ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్న టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేస్తే కోహ్లి మరో రికార్డును సొంతం చేసుకుంటాడు.
అంతర్జాతీయంగా టెస్టుల్లో కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో పాంటింగ్, కోహ్లిలు ఒకే స్థానంలో ఉన్నారు. ఇద్దరూ ఆ విషయంలో నంబర్ వన్ స్థానంలోనే ఉన్నారు. టెస్టుల్లో కెప్టెన్లుగా పాంటింగ్, కోహ్లి ఇద్దరూ చెరో 41 సెంచరీలు చేశారు. అయితే పాంటింగ్ ఇప్పుడు ఆడడం లేదు కనుక కోహ్లి ఇంకొక్క సెంచరీ చేస్తే 42 సెంచరీలు అవుతాయి. దీంతో కెప్టెన్‌గా అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టిస్తాడు. అయితే విదేశీ గడ్డపై గత 2 ఏళ్లుగా కోహ్లి ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. కనుక అతను ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆ ఘనతను సాధిస్తాడా, లేదా.. అన్నది సందేహంగా మారింది.
Read More:
ఒకే ఒక్క గోల్డెన్ గోల్.. భారత్ జట్టును సెమీస్‌కు చేర్చిన గుర్జిత్ కౌర్ మీకు తెలుసా?
పీవీ విందు: అమూల్ స్టైల్‌లో పీవీ సింధు కాంస్యం సంబరాలు