మహారాష్ట్ర నాగపూర్ లో జరిగిన రెండో టి20 ఇంటర్నేషనల్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియన్లను మట్టి కరిపించింది. వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ భారత బ్యాటర్ల సత్తా చాటింది. ప్రత్యేకించి రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్. అటు బౌలర్లు కూడా రాణించారు. 8 ఓవర్లలోనే ఐదు వికెట్లు నేలకూల్చారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ ను అస్థిరపరిచారు.
అయితే మ్యాచ్ విజయం అనంతరం దినేష్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియా తో రెండో టీ20 లో పంత్ జట్టులో ఎందుకు ఉన్నాడు అంటూ విలేకరులు ప్రశ్నించారు. దానికి డీకే అదిరిపోయే రిప్లై ఇచ్చారు.
“వర్షం కారణంగా మ్యాచ్ ను ఎనిమిది ఓవర్లకు కుదించారు. దీంతో కెప్టెన్ రోహిత్ కు అయిదుగురు బౌలర్ల ఆప్షన్ అవసరం లేకుండా పోయింది. జట్టులో నలుగురు బౌలర్ బౌలర్లు ఉంటే చాలు, అయితే హార్దిక్ రూపంలో ఏదో బౌలర్ ఉండనే ఉన్నాడు. అందుకే ఉమేష్ యాదవ్ స్థానంలో పంత్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే, ఓవర్లు కుదించినప్పుడు స్పెషలిస్ట్ బ్యాటర్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే నాతో పాటు పంత్ కూడా జట్టులో ఉన్నాడు. తర్వాత మ్యాచ్ లో ఇలాగే కొనసాగుతుందా అంటే మాత్రం చెప్పలేను” అంటూ పేర్కొన్నాడు.
Only active pair of 2007 World Cup winning squad playing and finishing together just before the day India Won that World Cup makes the chase even more special ❤️#DineshKarthik #RohitSharma𓃵
pic.twitter.com/yteS7Ko7W9— Rekha (@sameera2802) September 23, 2022
#RohitSharma is a big player. His ability to play fast bowling is second to none in this world- #DineshKarthik #DK #INDvAUS #RohitSharma𓃵 pic.twitter.com/7wt6ES5zeq
— Bhanu Kumar Jha (@BhanuKumarJha) September 23, 2022