వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌.. 498 పరుగుల భారీ స్కోర్‌

-

నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ హిస్టరీ సృష్టించింది. 498/4 పరుగులతో వన్డే చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది ఇంగ్లాండ్. దీంతో ఇంగ్లాండ్ తన రికార్డును తానే తిరగ రాసుకుంది. అంతకుముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లాండ్ పేరిటే ఉంది. 2018 సంవత్సరంలో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ చేసిన 481 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.

మూడు వన్డేల సిరీస్ కోసం నెదర్లాండ్స్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ జట్టు. శుక్రవారం అమ్ స్తెలివిన్ వేదికగా… జరుగుతున్న తొలి వన్డేలో ఈ అత్యధిక స్కోరు నమోదు చేసింది ఇంగ్లాండ్. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ కు జట్టు 2 ఓవర్ లోనే షాక్ తగిలింది.

ఓపెన్ రాయ్ ఒక పరుగుకే బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ సాల్ట్ 122 పరుగులు.. డేవిడ్ మలన్ 120 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరు పెవిలియన్ చేరిన అనంతరం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ డకౌట్ అయ్యాడు. అయితే అప్పటికే గ్రీజ్ లో ఉన్న బట్లర్ 162 పరుగులు చేసి.. నెదర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో నాలుగు వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 498 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news