తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు శుభవార్త

తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది బీసీసీఐ. 2023లో టీమిండియా ఆడబోయే మూడు సిరీస్ లలో భాగంగా తెలుగు రాష్ట్రాలలోనూ మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు తెలిపింది. న్యూజిలాండ్ తో భారత్ ఆడబోయే తొలి వన్డే జనవరి 18న హైదరాబాద్ లో జరగనుంది.

రెండో వన్డే జనవరి 21 రాయిపూర్, మూడవ వన్డే జనవరి 24 ఇండోర్. ఇక మూడు టి-20లలో భాగంగా జనవరి 27న తొలి టీ20 రాంచి, రెండవ టి20 జనవరి 29న లక్నో, ఫిబ్రవరి 1న మూడవ టి20 అహ్మదాబాద్ లో జరగనుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా తో జరిగే మొదటి టెస్ట్ ఫిబ్రవరి 9 నాగపూర్, ఫిబ్రవరి 17న రెండవ టెస్ట్ ఢిల్లీ, మూడవ టెస్ట్ మార్చి 1న ధర్మశాల, నాలుగో టెస్ట్ మార్చి 9న అహ్మదాబాద్ లో నిర్వహించనున్నారు. ఇక ఆస్ట్రేలియా తో 3 వన్డేలు జరగనున్నాయి. అందులో మార్చి 19న జరిగే రెండవ వన్డే వైజాగ్ లో ఉండనుందని బిసిసిఐ పేర్కొంది.