విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌

విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌. సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్ ఆడేందుకు విండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ మరోసారి భారత్ లో అడుగుపెట్టనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్ యూనివర్సల్ బాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ విషయాన్ని గుజరాత్ జెయింట్స్ యాజమాన్యం ఆదాని స్పోర్ట్స్ లైన్ శనివారం అధికారికంగా ధ్రువీకరించింది. పొట్టి క్రికెట్ లో అనేక రికార్డులు కలిగిన గేల్ ఎల్ ఎల్ సి లో ఆడటం చాలా సంతోషంగా ఉందని, లీగ్ సీఈఓ సహ వ్యవస్థాపకుడు రామన్ రహేజా అన్నారు. కాగా గేల్ తో ఒప్పందానికి ముందే గుజరాత్ జెయింట్స్ 15 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేసుకుంది. డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం ఫ్రాంచైజీ పర్సులో కొంత డబ్బు మిగిలి ఉండటంతో గేల్ తో ఒప్పందం చేసుకోవాలని యాజమాన్యం భావించింది. ఇందులో భాగంగా యూనివర్సల్ బాస్ తో సంప్రదింపులు జరిపి డీల్ కు కాయం చేసుకుంది.