IND VS SA : అందమైన అమ్మాయిలతో టీమిండియా ప్లేయర్లకు గ్రాండ్ వెల్‌కం..

IND VS AUS : రాబోయే టి20 వరల్డ్ కప్ కు ముందు భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు టీ 20 ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు టి20 ల సిరీస్ ను 2-1 తో గెలిచిన టీమిండియా, సౌత్ ఆఫ్రికా తో సమరానికి సిద్ధమవుతోంది. బుధవారం తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-సౌత్ ఆఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఈ నేపథ్మంలోనే టీమ్ ఇండియా బస చేసే హోటల్ కు బస్సు చేరుకోగా బస్ దిగిన ప్లేయర్లకు స్వాగతం పలికేందుకు కేరళ క్రికెట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్ దిగి హోటల్ కు వచ్చే మార్గంలో ప్లేయర్లపై అందమైన అమ్మాయిలతో పూలు చల్లించారు.

అలాగే ప్లేయర్ల మెడలో మెడల్స్ కూడా అమ్మాయిలతో వేయించారు. సాంప్రదాయ చీరకట్టుతో తణుకులీనుతున్న నవ్వుల మధ్య భారత ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ హోటల్లోకి వెళ్లారు. అలాగే ఓనమ్ ఫెస్టివల్స్ సందర్భంగా ధరించే స్పెషల్ కాస్ట్యూమ్స్ ధరించిన కళాకారులతో కూడా ప్లేయర్లకు వెల్ కమ్ చెప్పించారు. ఇక హోటల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కూడా కేరళ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది.