భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య ఇటీవలే నటాషా స్టాంకోవిచ్తో విడిపోయిన విషయం తెలిసిందే. గత నెలలో సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌తో వివాహ బంధానికి ముగింపు పలికాడు. ఆ తర్వాత హార్దిక్ బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేతో డేటింగ్లో ఉన్నాడంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ స్టార్ ప్లేయర్కు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
హార్దిక్ మరో బ్రిటిష్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో డేటింగ్లో ఉన్నట్లు నెట్టింట రూమర్లు మొదలయ్యాయి. వీరిద్దరూ కలిసి వెకేషన్లకు కూడా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రీస్‌లోని ఓ హోటల్ స్విమ్మింగ్ పూల్ వద్ద నడుస్తున్న వీడియో పోస్టు చేశాడు. అయితే నాలుగు రోజుల ముందు జాస్మిన్ వాలియా కూడా ఇదే లొకేషన్‌లో ఫొటోలు దిగి ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ కలిసే వెకేషన్‌కు వెళ్లినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా.. ఈ పోస్ట్‌లను ఒకరికొకరు లైక్ చేయడంతో ఈ రూమర్లు మొదలయ్యాయి.