హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతూ.. వాహనదారులను అలెర్ట్ చేస్తారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సినిమాలోని కొన్ని సీన్లను, అలాగే.. క్రికెటర్లను వాడుకుని మరీ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తారు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు అన్ని దారులను వాడుకుంటున్నారు.
అయితే.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాడేశారు. హెల్ మెన్ ధరించాలని సచిన్ పోస్టు చేసిన.. వీడియోను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. షేర్ చేసి.. ఇక్కడి వాహనదారులకు అలెర్ట్ చేశారు. తాజాగా సచిన్ టెండూల్కర్ కారులో వెళుతూ.. వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని ఓ వాహనదారుడికి సూచనలు ఇచ్చాడు. అయితే.. ఆ వీడియో ను తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసి.. ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WearHelmet At the Back Also.
Why should only the #rider be wearing a #Helmet?
Please wear a Helmet when ever you get on Bike.
– @sachin_rt#SachinTendulkar #BeResponsible pic.twitter.com/1sMtBYsXPr— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) February 4, 2022