ఒలింపిక్స్ : గురి తప్పిన పురుషులు..!

-

ఒలింపిక్స్ 2024 లో భారత ఆర్చర్లు వరుసగా నిరాశపరుస్తూనే ఉన్నారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అభిమానులను నిరుత్సహానికి గురి చేస్తూనే ఉన్నారు. నిన్న మహిళల టీం పోటీలో భారత మహిళలు దారుణమైన ప్రదర్శన కనబర్చగా.. పురుషులు కూడా వారిలో ఫాలో అయ్యారు. తాజాగా జరిగిన క్వాటర్ ఫైనల్స్ మ్యాచ్ లో టర్కీ చేతిలో 2-6 తేడాతో ఓడిపోయారు.

అయితే భారత ఫ్యాన్స్ కు ఎన్నో ఆశలు ఉన్న ఆర్చర్ ధీరజ్ ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు. కేవలం రెదనుసార్లు మాత్రమే 10 స్కోర్ చేయగా.. 7 స్కోర్ తో ఆరంభించాడు. దాంతో మొదటి సెట్ లో 57-53 తేడాతో టీమిండియా సులువుగా టర్కీకి రెండు పాయింట్స్ ఇచ్చేసింది. ఆ తర్వాత రెండో సెట్ లో కూడా మాన ఆర్చలు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. 52-55 తేడాతో మరో రెండు పాయింట్స్ కూడా ఇచ్చేసారు. ఇక తప్పక గెలవాల్సిన మూడో సెట్ లో 55-54 తో 2 పాయింట్స్ సాధించింది. కానీ చివరి సెట్ లో 54-58 తో ఓడిపోయింది. దాంతో టర్కీ 2-6 తేడాతో విజయం సాధించి సెమీస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version