టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టింది. లక్నో వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టి20 లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లో స్కోర్ నమోదు అయినప్పటికీ, ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన కివిస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 99 పదవులు మాత్రమే చేయగలిగింది.
100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్ ను 1-1 తో సమం చేసింది. నిర్ణయాత్మక మూడో టి20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు 30 ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాయి. అంతర్జాతీయ టి20లో ఫుల్ మెంబర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎక్కువ ఓవర్లు స్పిన్నర్లతో వేయించిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.