క్రికెట్‌ లవర్స్‌ కు గుడ్‌ న్యూస్‌..డిసెంబర్‌ లో ఐపీఎల్‌ వేలం !

ఐపీఎల్-15 ముగిసిన మూడు నెలలు కావస్తున్నది. క్యాష్ రిచ్ లీగ్ తర్వాత సీజన్ వచ్చే ఏడాది మార్చి చివరి వారంలో ప్రారంభమవుతుంది. అయితే ఐపీఎల్-16కు సంబంధించిన ఆసక్తికర వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. వచ్చే సీజన్ కోసం బిసిసిఐ, ఐపిఎల్ మినీ వేలాన్ని నిర్వహించనున్నది. ఈ ప్రక్రియను డిసెంబర్ 16న నిర్వహించనున్నట్టు సమాచారం.

ఈ మేరకు బీసీసీఐ, ఐపిఎల్ పాలకమండలి పెద్దలు చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. వేలం తేదీని బీసీసీఐ ఇంకా అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే వేలంతో పాటు ఈసారి ప్రతి ఫ్రాంచైజీ పర్స్ బ్యాలెన్స్ ను రూ.95 కోట్లుగా నిర్ణయించారు. గత వేలంలో ఇది రూ.5 కోట్లు పెరగనుంది. 2024 లో దీనిని 100 కోట్లకు పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే డిసెంబర్ 16న నిర్వహించడం ఖాయమేనా? అనేది బిసిసిఐ త్వరలోనే తేల్చనుంది. మరికొద్ది రోజుల్లో బీసీసీఐ వార్షిక సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో మినీ వేలం తేదీతో పాటు వేదికను కూడా ఖరారు చేయనున్నారు.