ఐపీఎల్ 2023 లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ల మధ్యన కీలక మ్యాచ్ జరగనుంది, ఇందులో గెలిచిన జట్టు 2 పాయింట్లు తెచ్చుకుని పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుంటుంది. ఈ సీజన్ లో ఈ రెండు జట్లు కూడా చాలా దారుణమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాయి. ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు 6 మ్యాచ్ లను ఆడగా, ఢిల్లీ ఒకటి మాత్రమే గెలవగా… SRH మాత్రం రెండు మ్యాచ్ లలో గెలిచి పర్వాలేదనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. కాగా సొంతగడ్డపై హైదరాబాద్ ఛేజింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో అయినా ఇటు జట్లలో అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు రాణిస్తారా చూడాలి.