ఐపిఎల్ 2023: “సన్” రైజ్ అవుతుందా… హ్యాట్రిక్ విన్ పై గురి పెట్టిన పంజాబ్ !

-

ఈ రోజు రాత్రి జరగనున్న మ్యాచ్ లో అందరి దృష్టి సన్ రైజర్స్ హైదరాబాద్ మీదనే నిలవనుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ కనీసం పోటీ ఇవ్వకుండా ఓడిపోయారు. SRH కెప్టెన్ మారినా జట్టు తలరాత మారడం లేదు. వేలంలో సైతం పెద్ద ఆటగాళ్లను కొనుగోలు చేయడంలో యాజమాన్యం చేసిన తప్పులే ఇప్పుడు వరుస ఓటములకు కారణాలు అని చెప్పాలి. ఇక ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో మొదటి విజయం కోసం మార్ క్రామ్ సేన బరిలోకి దిగుతోంది.

SRH లో మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, బ్రూక్ మరియు మార్ క్రాం లు అంచనాలకు తగినట్లు రాణిస్తే SRH కు మొదటి విజయం దక్కుతుంది. బౌలింగ్ లోనూ భువి మునుపటిలా ఆరంభంలో వికెట్లు తీయాలి… నటరాజన్ సైతం తన బౌలింగ్ లో పదును పెంచి ప్రత్యర్ధులపై ఒత్తిడి పెంచాలి. ఇక రెండు వరుస విజయాలతో సీజన్ ను ఘనంగా ఆరంభించిన పంజాబ్ కింగ్స్ జట్టు హ్యాట్రిక్ విజయం కోసం సన్నద్ధమవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో ఫేవరేట్ అంటే పంజాబ్ కింగ్స్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి చూద్దాం చివరికి ఎవరు విజయం సాధిస్తారో ?

Read more RELATED
Recommended to you

Latest news