మరో 24 రోజుల్లో టి20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ టీ 20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. బౌలింగ్ బ్యాక్ బోన్ జస్ప్రీత్ బూమ్రా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికా సిరీస్ తో పాటు టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు దూరం అయ్యాడు. ఇది ఏ మాత్రం ఊహించని పరిణామమే.
గాయం వల్ల స్టార్ పెసర్ దూరం కావడం జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. అతని స్థానంలో హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ కు అవకాశం దక్కుతుందనే సమాచారం ఉంది. టీ 20 కప్ పక్కకు పెడితే.. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టూర్ కు సిరాజ్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.
ఇక వరల్డ్ కోసం మరో పేస్ బౌలర్ మహమ్మద్ షమీ పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. బూమ్రా వెన్నెముక ఫ్రాక్చర్ బారిన పడినట్టు సమాచారం అందిన కొద్దిసేపటికే, షమీ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. సీనియర్ కావడం వల్ల సెలెక్టరులు షమీ వైపే మొగ్గు చూపొచ్చు. అదే జరిగితే, సిరాజుకు టి20 ప్రపంచ కప్ ఆడే ఛాన్స్ దక్కనట్టే.