చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా విండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా తీవ్ర విమర్శలు చేసారు. నాలుగు మ్యాచ్ లు చెన్నై ఓడిపోవడంతో ఫాన్స్ కూడా నిరాశగా ఉన్నారు. నిన్న జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్లు ముగిసే సమయానికి 1 వికెట్లకు 90 పరుగులు సాధించినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. ధోని బ్యాటింగ్ ఆర్డర్ పై మండిపడ్డాడు.
సిఎస్‌కె కు 47 బంతుల్లో 68 పరుగులు అవసరమైనప్పుడు అతను క్రీజ్ లోకి వచ్చాడు. 11 వ మరియు 15 వ ఓవర్ల మధ్య, సిఎస్కె కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది, ధోని 11 పరుగులు చేయడానికి 12 బంతులు ఆడాడు. దీనిపై స్పందించిన లారా… ధోని ఆడకపోవడం ఏంటో తనకు అర్ధం కావడం లేదని, “అతను గొప్ప ఫినిషర్, దాని గురించి ఎటువంటి సందేహం లేదు. కాని అతనికి పరిస్థితులు కలిసి రావడం లేదు. ధోని అసలు ఏ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తాడో ముందు తెలుసుకుంటే మంచిది అని చెప్పాడు.