టీ 20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ నిన్న భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 15 మంది ఆటగాళ్లతో జాబితాను రిలీజ్ చేసింది బీసీసీఐ. రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. బీసీసీఐ సెక్రటరీ, అజిత్ అగార్కర్ తో కూడిన సెలక్షన్ ప్యానెల్ వరల్డ్ కప్ కు ఆడే భారత జట్టును ఎంపిక చేసింది. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. టీ 20 ప్రపంచ కప్ జూన్ 01 నుంచి మొదలవ్వనుంది.
టీ20 వరల్డ్ కప్ కోసం అమెరికా, వెస్టిండిస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే నిన్న ఎంపిక చేసిన భారత జట్టు పై నటుడు శరత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశమన్నా, భారత జట్టన్నా మాకు ఎప్పుడూ ఇష్తమే. కానీ తమిళ పేర్లు లేకపోవడం నిరుత్సాహం కలిగించింది. నటరాజన్ బౌలింగ్ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. డెత్ ఓవర్లలో అతడు అద్భుతమైన యార్కర్లు సందిస్తాడు. అతడిని తిరిగి జట్టులోకి తీసుకునేందుకు ఆలస్యం చేయవద్దు అంటూ ట్వీట్ చేశారు శరత్ కుమార్.