ప్యారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత అభిమానులు మెడల్ ఆశలు పెట్టుకున్న మొదటి వ్యక్తి నీరజ్ చోప్రా. అయితే గోల్డ్ సాధిస్తాడు అనుకున్న నీరజ్.. సిల్వర్ మెడల్ ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్ కు చెందిన అర్షద్ నదీమ్ యొక్క రికార్డ్ త్రో వల్ల నీరజ్ కు గోల్డ్ మిస్ అయ్యింది. ఫైనల్స్ లో నీరజ్ 89.45 మీటర్ల త్రో విసరగా.. నదీమ్ 92.97 మీటర్ల అద్భుతమైన త్రో తో బంగారు పతకం పట్టుకెళ్లిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఒలింపిక్స్ ముందు నుండి గాయాలకు గురవుతున్నాడు నీరజ్. ఆ కారణంగానే ఫైనల్స్ లో కూడా తన బెస్ట్ ఇవ్వలేకపోయాడు. దాంతో నీరజ్ ఇప్పుడు తన గాయానికి శాశ్వత పరిష్కారంగా సర్జరీ చేయించుకోబోతున్నాడు. అయితే ఈ సర్జరీ నుండి కోలుకోవడానికి నీరజ్ కాస్త ఎక్కువ సమయం పెట్టనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఒలింపిక్స్ తర్వాత నుండి నీరజ్ కోచింగ్ స్టాఫ్ కూడా మారబోతున్నారు.