ఆసియా కప్ లో భాగంగా నిన్న హాంకాంగ్ మరియు పాక్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రసవత్తర మ్యాచ్ లో పాక్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీంతో సూపర్ 4 కు దూసుకెళ్లింది పాక్. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 193 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వేపై విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే.. అంతర్జాతీయ టి20 లో పాకిస్తాన్ అరుదైన ఘనత సాధించింది.
టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా పాకిస్తాన్ రికార్డులకు ఎక్కింది. ఆసియా కప్-2022 లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 155 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. తద్వారా రికార్డును పాకిస్తాన్ తన ఖాతాలో వేసుకుంది.
కాగా అంతకుముందు 2018 లో ఐర్లాండ్ పై 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా రెండో స్థానంలో ఉండేది. తాజా మ్యాచ్ తో భారత్ రికార్డును పాకిస్తాన్ బ్రేక్ చేసింది. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మొదటి స్థానంలో కొనసాగుతుంది. 2007లో జోహన్నెస్ బర్గ్ వేదికగా కెన్యా తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 172 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.