తెలంగాణ అమ్మాయిగా గర్వపడుతున్నా – నిఖత్ జరీన్

-

ఒకే ఏడాది వరుసగా 3 గోల్డ్ మెడల్స్ సాధించడం గర్వంగా ఉందని అన్నారు నిజామాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్. తెలంగాణ అమ్మాయి గా గర్వపడుతున్నాను అని చెప్పారు. మెడల్ తీసుకుంటున్నప్పుడు జాతీయగీతం ప్లే అవుతుంటే… చాలా ఎమోషనల్ అయ్యానని.. ఏడ్చేశానని అన్నారు. అప్పటివరకు తానుపడ్డ కష్టం అంతా కళ్ళ ముందు మెదిలిందని ఎమోషనల్ అయ్యారు.

“నేను ఈ స్టేజ్ లో ఉన్నా అంటే కారణం.. మా నాన్న. నా ఫిట్నెస్ ఇలా ఉందంటే మా అక్క. ఫిజియో గా చాలా సహాయపడింది. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ టోర్నీ లతో చాలా అలిసిపోయాను.
అమ్మాయివి కదా… బాక్సింగ్ వద్దు అని మా అమ్మ చాలాసార్లు అడ్డుకుంది. కానీ.. నా విజయాలు చూసి ప్రోత్సహించింది. పేరెంట్స్ కి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను… పిల్లలకు ఆసక్తి ఉన్న గేమ్ వైపు ఎంకరేజ్ చేయండి. ఇది అమ్మాయిల గేమ్… ఇది అబ్బాయిల గేమ్ అని అడ్డుచెప్పకండి”. అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news