రంజీ ఫైనల్‌లో బ్యాటింగ్ చేస్తూ ఏడ్చేసిన సర్ఫరాజ్..వీడియో వైరల్

-

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై మరియు మధ్యప్రదేశ్ మధ్య రంజీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. లంచ్ విరామం సమయానికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసి ముంబై. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్ 119 పరుగులు దేశ్పాండే 6 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ 2024 బంతుల్లో 119 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్ అలాగే 13 ఫోర్లు ఉన్నాయి. లంచ్ విరామం సమయానికి సెంచరీ పూర్తి చేసుకున్నాడు సర్ఫరాజ్. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ… ఎంతో ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు సర్ఫరాజ్.

ఈ నేపథ్యంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కాస్త ఎమోషనల్ అయ్యాడు సర్ఫరాజ్. సెంచరీ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకుంటూ కంటతడి పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news