సౌత్ ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్ లో 176 కి ఆలౌట్

-

టీమిండియాకు సువర్ణావకాశం. దక్షిణాఫ్రికాపై గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ను సమం చేసేందుకు రోహిత్‌ సేనకు అద్భుత అవకాశం లభించింది. కావాల్సిందల్లా టీమిండియా బ్యాటర్లు కాస్త ఓపికతో బ్యాటింగ్‌ చేయడమే. అలాగనీ భారత విజయ లక్ష్యమేమీ మరీ పెద్దగా ఏమీ లేదు. కానీ పిచ్‌ బౌలర్లకు స్వర్గధామంలా మారింది. కాబట్టి స్వల్ప లక్ష్యమైనా జాగ్రత్తగా ఆడాల్సిందే.

గురువారం జనవరి 04 న భారత బౌలర్లు మళ్లీ చెలరేగారు. మొదటి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కుప్పకూల్చారు. ఓవర్‌ నైట్‌ 62/3 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన సఫారీ జట్టు.. 176 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియాకు 79 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్‌క్రమ్‌ (106) శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అయితే తోటి బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌ కు క్యూ కట్టారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా ఆరు వికెట్లతో సౌతాఫ్రికా నడ్డి విరిచాడు. ముకేశ్‌కుమార్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version