ఐపిఎల్ 2023: ముంబైతో హైదరాబాద్ “ఢీ”… ఫ్యాన్స్ కు పూనకాలే !

-

ఐపిఎల్ 2023 లో జరుగుతున్న ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠగా ముగుస్తోంది. కొన్ని మ్యాచ్ లు అయితే ఆఖరి బంతి వరకు ఫలితం తేలడం లేదు. ఇప్పటి వరకు 24 మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఈ రోజు ఐపిఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ జట్ల మధ్యన హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. కాగా రెండు జట్లు కూడా ఈ టోర్నీని అపజయాలతో ప్రారంభించి ఆ తర్వాత రెండు వరుస విజయాలను సాధించి కొంచెం గాడిన పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎవరు గెలుస్తారు అన్న విషయం పట్ల అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

పాయింట్ల పట్టికలో రెండు జట్లు కూడా 4 మ్యాచ్ లు ఆడి రెండు గెలిచి రెండు ఓడాయి. కానీ నెట్ రన్ రేట్ పరంగా కొంచెం మెరుగ్గా ఉన్న ముంబై 8 వ స్థానంలో ఉంది, ఇక ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉంది. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున హరీ బ్రూక్ సెంచరీ చేసి ఫామ్ లోకి వచ్చాడు… అదే విధంగా ముంబై లోనూ ఇషాన్ కిషన్ మరియు సూర్య లు ఫామ్ లోకి రావడం శుభపరిణామం. మరి చూద్దాం ఈవెనింగ్ ఎవరు గెలుస్తారో ??

Read more RELATED
Recommended to you

Latest news