వైజాగ్ టెస్ట్‌ : రోహిత్ మ‌ళ్లీ సెంచ‌రీ… రికార్డుల వ‌ర్షం

-

దక్షిణాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలో తొలిసారిగా ఓపెనర్‌గా రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. అయితే భారత్ తరపున టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటి వరకూ విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె ఉండగా.. తాజాగా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

అలాగే స్వదేశంలో వరుసగా ఏడుసార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. అంతేకాక.. మూడు ఫార్మాట్లలో అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా మాజీ ఆటగాడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ రికార్డును రోహిత్ అధిగమించాడు. కాగా, రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 13 సిక్సులు కొట్టిన రోహిత్ రెండో ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సులతో 127 పరుగులు చేసి కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో స్టంప్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో ఒకే మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లో స్టంప్ ఔట్ అయిన ఏకైక భారత ఆటగాడిగా కూడా రోహిత్ రికార్డు సాధించాడు.

Read more RELATED
Recommended to you

Latest news