ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ టీమిండియాలో చోటు కోల్పోవడానికి యోయో టెస్టే కారణమని అన్నారు. తాను దాంట్లో పాస్ కాలేనని భావించే క్రికెట్‌కు గుడ్ బై చెప్పానని వెల్లడించారు. అయితే, ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉంటే మాత్రం తన పరిస్థితి వేరేలా ఉండేదని, తన క్రికెట్ కెరీర్‌ను అర్థాంతరంగా ముగించాల్సి వచ్చేది కాదని అన్నాడు. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ హయాంలోనే యోయో టెస్టును ప్రారంభించడాన్ని యువీ పరోక్షంగా విమర్శించాడు.
క్రికెటర్ బాగా ఆడుతుంటే ఆ టెస్టుతో పనేంటని నిలదీశాడు. కాగా, కేన్సర్ ను జయించి క్రికెట్‌లోకి మళ్లీ వచ్చాక ఆయన యోయో టెస్ట్ పాస్ కాలేదంటూ ఆయనను పలుసార్లు జట్టులోకి తీసుకోలేదు. ఇప్పటికే యోయో టెస్ట్‌పై యువీ పలుసార్లు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.