BWF World Championship: టోక్యో వేదికగా సోమవారం నుంచి ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నీ మొదలైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టోర్నీ ప్రారంభమైన రెండో రోజే సైనా దుమ్ములేపింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మాజీ ఛాంపియన్, హైదరాబాది సైనా నెహ్వాల్ అదరగొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ లో హాంకాంగ్ కు చెందిన చేయూంగు నన్ పై 21-19, 21-9 తో ఓడించింది.
కాగా మ్యాచ్ ఫలితం 38 నిమిషాల్లోనే పూర్తయింది. కాగా రెండో రౌండ్ లో జపాన్ కు చెందిన ఆరవ సీడ్ నవోమి ఓకుహరతో తలపడాల్సి ఉండగా, ఆఖరి నిమిషంలో ఒకుహర గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో సైనాకు థర్డ్ రౌండ్ కు బై లభించింది. దీంతో మూడో రౌండ్లో సైనా నెహ్వాల్, థాయిలాండ్ కు చెందిన భూసానన్ ఒంగ్ భమ్రుంగ్ ఫాన్, జర్మనీకి చెందిన వైఓన్ లీ మధ్య విజేతతో తలపడనుంది.