వినికిడి లోపం రావడానికి ఈ తప్పులే ప్రధాన కారణం

-

ఈ రోజుల్లో చాలామందికి వినికిడి సమస్య ఉంటుంది. ఒకప్పుడు పుట్టుకతో వినికిడి సమస్య వచ్చేది అంతే.. మిగిలినవారికి ఎప్పుడో వృద్యాప్యంలో మళ్లీ ఈ సమస్య ఉండేది. కానీ ఇప్పుడు నడివయసు వారు కూడా.. వినికిడి సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. అసలే కొన్ని జాబ్స్ డ్యూటీలో ఉన్నంతసేపూ.. హెడ్ సెట్ పెట్టుకుని వినేవి, మాట్లాడేవి ఉంటున్నాయి. ఇక అలాంటివారికి చెవులు త్వరగా పాడవుతాయి. ఇంట్లోంచి బయటకురాగానే.. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టి ప్రపంచంతో పనిలేకుండా.. పాటలు వినడం ఒక తప్పైతే.. ఇంకా కొన్ని మనం తెలిసీ తెలియక చేసే తప్పులు కూడా వినికిడి సమస్యకు కారణం అవుతున్నాయి.

సౌండ్‌ ఎక్కువగా పెట్టుకొని టీవీ చూడటం, పాటలు బిగ్గరగా వినడం, బిగ్గరగా మాట్లాడటం వినికడి లక్షణాలుగా ఉంటాయి. టీవీ సౌండ్ ఎక్కువ పెడితే కానీ మనకు మంచిగా అనిపించడం లేదంటే.. మీ చెవులు ప్రమాదంలో ఉన్నట్లే. సకాలంలో గుర్తించి సరైన చికిత్స చేయించుకుంటే సమస్య పెద్దది కాకుండా చూసుకోవచ్చు. వినికిడి సమస్యకు ఇతర కారణాలు ఏంటంటే..

చెవులను తడిగా ఉంచుకోవడం..

తరచుగా చెవులు తడిగా ఉండటం మంచిదికాదు. ఇలా చేయడం వల్ల చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ (ఆటోమైకోసిస్)ఏర్పడుతుంది. ఈ సమస్య ఎక్కువగా ఈతగాళ్లలో కనిపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్‌కి కారణం ఆస్పర్‌గిల్లస్, కాండిడా అనే బ్యాక్టీరియా. ఇది తేమ కారణంగా వేగంగా వ్యాపిస్తుంది.

బిగ్గరగా సంగీతం వినడం..

ఎక్కువ సౌండ్ పెట్టి మ్యూజిక్ వినే అలవాటు ఉంటే.. వీలైనంత వరకూ అది తగ్గించుకునే ప్రయత్నం చేయండి. బిగ్గరగా సంగీతం వినడం వల్ల చెవి పని చేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది మీ వినికిడి శక్తిని క్రమంగా తగ్గిస్తుంది.. ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది.

ఈ తప్పు అస్సలు చేయొద్దు..

చెవుల్లో ఇయర్‌బడ్‌లు, పిన్‌లను పెట్టుకోవద్దు. స్నానం చేసేటప్పుడు చెవిలో నీరు పోయడం మానుకోండి. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. కాబట్టి స్నానం చేసేప్పుడు పొరపాటున కూడా చెవిలో నీరు పోయొద్దు. అంతేకాదు.. స్నానం చేసిన తర్వాత చెవులును కూడా ప్రత్యేకంగా టవల్ తో క్లీన్ చేసుకోవాలి. చాలామంది.. చెవులను తుడుచుకోరు.. దానివల్ల ఆ తేమ ఎప్పటికో ఆరిపోతుంది. అలా కాకుండా బాడీతో పాటే. చెవులను కూడా అప్పుడే క్లీన్ చేసుకోవడం అలవాటుగా చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news