తనపై వచ్చిన విమర్శలపై గట్టి కౌంటర్ ఇచ్చిన శ్రీలీల..!!

-

కన్నడ భామ్మ అయినటువంటి హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరోయిన్లకు పోటీగా వరస సినిమాలలో నటిస్తూ ఉంటోంది. ఈ ముద్దుగుమ్మ మొదట పెళ్లి సందD సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో ఇమెను నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రవితేజ తో కలిసి ధమాకా చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో నటించడం పై కొంతమంది శ్రిలీల ను విమర్శలు కూడా చేసినట్లు సమాచారం . దీంతో ఈ ముద్దుగుమ్మ వీటి పైన గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.

శ్రీ లీల యంగ్ హీరోయిన్ అయ్యుండి సీనియర్ హీరో రవితేజ తో కలిసి నటించడంపై ట్రోల్ చేయడంతో.. వాటిపై హుందాగా స్పందించింది. శ్రీ లీల మాట్లాడుతూ.. పెళ్లి సందD సినిమా కంటే ముందు ధమాకా చిత్రంలో ఆఫర్ వచ్చిందని రవితేజ సార్ తో తన నటించడం తనకు లక్కీ అని అంతేకాకుండా ఈ సినిమాలో తన పాత్ర కూడా నచ్చడంతో ధమాకా చిత్రాన్ని ఓకే చేశానని తెలియజేసింది. దీన్ని బట్టి చూస్తే పెళ్లి సందD సినిమా కంటే ముందే రవితేజ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల అనుకున్నట్లుగా చెప్పవచ్చు. అలా తన మీద వచ్చిన రూమర్లపై గట్టి క్లారిటీ ఇచ్చింది.

ఇక ధమాకా చిత్రంతో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లయితే శ్రీలీలకి హీరోయిన్గా వరుస సినిమాలు వెళ్ళుబడుతూనే ఉంటాయి. ప్రస్తుతం శ్రీలీల దూకుడు టాలీవుడ్లో ఫాన్సను బాగా ఆకట్టుకుటోంది.మరి ఈ ముద్దుగుమ్మ తన క్రేజ్ ను క్యాష్ చేసుకొని ఎన్ని సినిమాలలో నటిస్తుందో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news