షాకింగ్‌ : మద్యం మత్తులో ఏఎస్సైపై బీర్‌ బాటిల్‌తో యువతి దాడి..

-

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో గత రాత్రి మద్యం మత్తులో ఓ యువతి హల్‌చల్‌ సృష్టించింది. అయితే.. గంజాయి, మద్యం మత్తులో ఉన్న సదరు యువతి డ్యూటీలో ఉన్న ఏఎస్సైపై దాడి చేసింది. అయితే.. ఆర్కే బీచ్‌ దగ్గర బహిరంగంగా సదరు యువతి మద్యం సేవిస్తోంది. దీంతో.. పెట్రోలింగ్‌లో ఉన్న ఏఎస్సై యువతిని ప్రశ్నించగా బీర్‌బాటిల్‌తో దాడికి పాల్పడింది. యువతి దాడిలో ఏఎస్సైకి తీవ్రగాయాలు కావడంతో, హుటాహుటిన సదరు ఏఎస్సైని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు యువతిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు విశాఖ త్రీటౌన్‌ పోలీసులు.

7 Real Worries With Women and Problem Drinking

అయితే.. గంజాయి మద్యం మత్తులో దుర్భాషలాడి త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడిన యువతి… పైగా కాలుతో తన్నిన ఉదంతం కలకలం రేపింది. నా బాయ్ ఫ్రెండ్ కి చెప్పి మిమ్మల్ని లేపించేస్తానంది అమూల్య. రేపటి నుంచి పోలీసులు ఎవరు రోడ్డుమీద తిరగకుండా చేస్తానని మైకంలో సవాల్ విసిరింది యువతి. నైట్ రౌండ్స్ లో ఉన్న ఏఎస్ఐ ఆమెను చూసి వెళ్లి ప్రశ్నించగా బీర్ బాటిల్ తో పోలీస్ పై దాడి చేసింది. త్రీ టౌన్ ASI పై దాడి చేస్తుండగా అక్కడ ఉన్న యువకుడు మధ్యలో అడ్డురావడంతో అతని కన్నుపై బీరు బాటిల్ తగిలి గాయం అయింది. పైగా బ్రీతింగ్ అనలైజర్ తో చెక్ చేస్తే యువతి తాగిన మత్తు వ్యాల్యూ 149 వచ్చింది.దీంతో అమూల్య పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. రాత్రి స్టేషన్ లో ఉంచకూడదని ఆమెని పంపించేశారు. ఉదయం రావాలని ఆదేశించారు. ఈఘటన విశాఖలో సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news