కాంగ్రెస్‌ హయాంలో అన్నదాతను ఆగం చేశారు : శ్రీనివాస్‌ గౌడ్‌

-

హన్వాడ మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడుతూ.. గతంలో కల్యాణ లక్ష్మి పథకం లేదు. ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందేనని, ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే విధంగా పరిస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోసం రూ.1,01,116 సాయంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందనిదని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ అన్నారు.

Minister Srinivas Goud | చివరికి న్యాయమే గెలిచింది.. పాలమూరు-రంగారెడ్డిని  పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తాం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌-Namasthe  Telangana

గతంలో కనీసం మంచినీళ్లు కూడా లభించే పరిస్థితి లేదు. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన కృష్ణా జలాలను
అందిస్తున్నాం. ఒకప్పుడు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు గగనంగా ఉండేది.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి మూడు గంటలకు కరెంటు మాత్రమే ఇచ్చి అన్నదాతను ఆగం చేశారు. నేడు అన్నదాత సంక్షేమం కోసం 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో రైతు అనుకోకుండా మరణిస్తే కనీసం ఒక రూపాయి పరిహారం కూడా లభించేది కాదు. ఇప్పడు అనుకోకుండా రైతు మరణిస్తే రూ.5 లక్షల రైతు బీమా అందించి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news