బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రాల్లో రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంట్ పథకాలు ఉన్నాయా ? అని ఆయన ప్రశ్నించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినందుకు కేసీఆర్ ను జైల్లో పెడతారా ? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలు అన్నిటినీ ప్రైవేట్ పరం చేసి ప్రజల మీద భారం మోపినందుకు ప్రధాని మోడీని కూడా జైల్లో పెడతారా ? అని ఆయన ప్రశ్నించారు.
ఒక్క సీటు గెలిచి విర్రవీగుతున్నారని, అలాంటిది మేము వంద సీట్లు గెలిచామని అన్నారు. తెలంగాణ ఉదయంలో మీరు ఎక్కడున్నారు ? అని ఆయన ప్రశ్నించారు. మహిళల మీద వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు బండి సంజయ్ కి లేదని, మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారనే విషయం మర్చిపోవద్దని ఆయన అన్నారు. మా బండారం బయట పెట్టడానికి ఏమీ లేదని, మా జీవితాలు అన్నీ ప్రజలకు తెలుసనీ అన్నారు. సీఎంను జైల్లో పెడితే తెలంగాణలో అగ్గిరాజు కుంటుందని, కేసీఆర్ ఒక్క మాట చెబితే సంజయ్ బయట తిర్గాలేరని అన్నారు.