తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త

-

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలక మండలి అదిరిపోయే శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి మెట్టు మార్గానికి ఏఫ్రిల్ 30వ తేది లోపు పున:ప్రారంభిస్తామని.. ప్రకటన చేశారు అదనపు ఇఓ దర్మారెడ్డి. సామాన్య భక్తులుకు విఐపి భక్తులు తరహలో దర్శన భాగ్యం కల్పిచేందుకే స్లాటడ్ విధానాన్ని అనుసరించామని తెలిపారు.

9వ తేదినే 12 వ తేదికి సంభందించిన టోకేన్లు జారీ చెయ్యడంతో….9వ తేదిన టోకేన్లు జారీ చెయ్యడాన్ని తాత్కలికంగా నిలిపివేసామని వెల్లడించారు. నిన్న తిరిగి రోజుకి 35 వేల టోకేన్లు జారి చేసే ప్రకియ ప్రారంభించామని తెలిపారు.

నిన్నటి రోజున టోకేన్లు జారి చేసే సమయంలో 20 వేల మంది మాత్రమే వున్నారని….. భక్తులు ఆత్రుత కారణంగా క్యూ లైనులో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. నిన్నటి ఘటనల నేఫథ్యంలో వెంటనే సర్వదర్శనం టోకేన్ విధానాని రద్దు చేసి….తిరుమలకు అనుమతించామన్నారు. ముందస్తూగా సిద్దంగా వున్నాం కాబట్టి అరగంటలోనే భక్తులును కంపార్టుమెంట్లలోకి అనుమతించామని వెల్లడించారు. ప్రస్తూత విధానంతో భక్తులు కంపార్టుమెంట్లలోనే వేచి వుండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news