శ్రుతి హాసన్ క్రేజ్ సూపర్ గురూ..!!

-

ఇప్పుడు తెలుగు పరిశ్రమలో శ్రుతి హాసన్ క్రేజ్ మామూలుగా లేదు. కమల్ హాసన్ కూతురు గా అడుగుపెట్టి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్   తనకు టర్నింగ్ పాయింట్ గా మారింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోల సరసన  చేసింది.

కాని  తర్వాత ఎందుకో చాలా రోజులు గ్యాప్ వచ్చింది..ఆ తర్వాత   గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆ సినిమా మళ్లీ ఆమె కెరియర్ కు ఊపిరి పోసింది.ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఒక పాత్రలో కనిపించి సందడి చేసింది.

ఇక ఇప్పుడు ఈ హీరోయిన్ సందడి అంతా ఇంతా కాదు. మిడిల్ ఏజ్ నుండి సీనియర్ హీరోల వరకు తానే మెయిన్ ఆప్షన్ గా ఉంది. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల వరస చూస్తే మనకు  అర్ధం అవుతుంది. సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తో వాల్తేరు వీరయ్య సినిమా లో, బాలయ్య బాబు తో వీర సింహ రెడ్డి లో అలాగే, పాన్ ఇండియా  స్టార్, ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం సలార్ లో కూడా నటిస్తోంది. ఇవన్ని హిట్స్ ఐతే అమ్మడి గ్రాఫ్ అమాంతం ఆకాశాన్ని తాకుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news