మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కొన్ని పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి వున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు చూస్తే.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,160 అప్రెంటిస్ పోస్టులని భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 390 ఖాళీలు, తెలంగాణలో 125 ఖాళీలు వున్నాయి.
ఈ పోస్టులకి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 21 దరఖాస్తులకు చివరితేది. 01.08.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల ఉన్నవాళ్లే అర్హులు. ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ను చూసి సెలెక్ట్ చేస్తారు. పోస్టుల వివరాలని చూస్తే.. ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ- 1389, ఈడబ్ల్యూఎస్- 603, యూఆర్- 2665). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 390 ఖాళీలు, తెలంగాణలో 125 ఖాళీలు వున్నాయట.
స్టైపెండ్ కింద నెలకు రూ.15,000 చెల్లిస్తారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి డిగ్రీ ప్యాస్ అయినవాళ్లు దరఖాస్తు చేసేయచ్చు. శిక్షణ వ్యవధి వచ్చేసి ఒక సంవత్సరం ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే.. జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మాత్రం దరఖాస్తు ఫీజు లేదు. దరఖాస్తులకు చివరితేది సెప్టెంబర్ 21, 2023. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూడవచ్చు.