స్టేట్ బ్యాంక్ కీలక నిర్ణయం… వచ్చే ఏడాది వరకు ఆ స్కీమ్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను అందిస్తుంది. వీటి వలన చక్కటి లాభాలను పొందొచ్చు. అయితే స్టేట్ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ని స్టేట్ బ్యాంక్ ఎక్స్టెడ్ చేసింది. పూర్తి వివరాలను చూస్తే..

సీనియర్ సిటిజన్ల కోసం ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను తీసుకు వచ్చారు. 2020 మే నెలలో ఈ వీకేర్ ని తీసుకువచ్చారు. కరోనా మహమ్మారితో సీనియర్ సిటిజన్లు ఇబ్బందులు పడుకూడదని స్టేట్ బ్యాంక్ ఈ స్కీమ్ గడువుని ఎక్స్టెండ్ చేసారు.

మార్చి 2023 వరకు ఎస్‌బీఐ వీకేర్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. రిటైర్ టర్మ్ డిపాజిట్ సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం దీన్ని లాంచ్ చేసింది. అయితే ఇందులో పెట్టుబడి పెడితే 0.50 శాతం అదనపు ప్రయోజనాలకు, మరో 0.30 శాతం వరకు లాభాలు వస్తాయి.

మొత్తంగా 80 బేసిస్ పాయింట్లు అత్యధికంగా సీనియర్ సిటిజన్లు వడ్డీ ఆదాయాలను పొందచ్చు. ఐదేళ్ల కాలం నుంచి పదేళ్ల కాలం మధ్యలో ఎస్‌బీఐ ఈ స్కీమ్ ని ఆఫర్ చేస్తుంది. పైగా లోన్ ఫెసిలిటీ కూడా వుంది. యోనో ద్వారా ఈ స్కీమ్ అందుబాటులో ఉంది లేదా నేరుగా బ్రాంచ్ కి వెళ్ళక్కర్లేదు. ఐదేళ్ల కాలానికి ఇప్పుడు 5.65 శాతం వడ్డీ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news