కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా పండుగ కన్నా ముందే గుడ్ న్యూస్ రాబోతోంది. డియర్‌నెస్ అలవెన్స్ త్వరలోనే పెరగచ్చని తెలుస్తోంది. వివరాలలోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఒక నిర్ణయాన్ని త్వరలోనే తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇది కనుక జరిగితే దసరా పండుగ జొనాంజా లభించినట్లే.
సాలరీ కూడా పెరుగుతుంది. డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం మేర పెరగవచ్చని తెలుస్తోంది. ఇలా జరిగితే 34 శాతం నుంచి 38 శాతానికి చేరుతుంది. ప్రతి ఏటా రెండు సార్లు డియర్‌నెస్ అలవెన్స్‌ను కేంద్రం మారుస్తూ ఉంటుంది. ఈ నెలాఖరుకు ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది.
సెప్టెంబర్ 28న క్యాబినెట్ మీటింగ్ ఉండొచ్చని కూడా తెలుస్తోంది. ఇక సాలరీలో ఎలాంటి మార్పులు వస్తాయో చూస్తే.. అలవెన్స్ 38 శాతానికి చేరుతుంది. సాలరీ రూ. 18000గా ఉంటే డీఏ రూ. 6840 అవుతుంది. అంటే జీతం రూ. 720 పెరుగుతుంది. అయితే ఇది ఉద్యోగులకి వస్తున్న సాలరీ ప్రకారం ఉంటుంది.
అయితే ఇప్పటికి ఎలాంటి నిర్ణయం కేంద్రం దీని మీద తీసుకుంటుందో స్పష్టత లేదు. కొన్ని నివేదికలు డీఏ పెంపు 5 శాతం వరకు ఉండొచ్చని అంటున్నాయి. మరి ఏం అవుతుందో చూడాలి. ఒకవేళ పండుగ ముందే ఈ నిర్ణయం తీసుకుంటే జొనాంజా లభించినట్లే.