ఈరోజు ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు జరిగింది . బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఇంటికి వచ్చి ఆయనతూ భేటీ అయ్యారు . ఈ నేపధ్యం లో ఆలపాటి ఇంట్లో సమావేశం జరిగింది. ఈ సమావేశం లో టీడీపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు కూడా పాల్గొన్నారు. నేతలు పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు.
ఈ నేపధ్యం లో సుజనా చౌదరి మాట్లాడుతూ, వైసీపీ సర్కారు రాష్ట్రము లో నుండి పోతే కానీ ఏపీకి మంచి రోజులు రావని అన్నారు. అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడి చేయడం దారుణమని తెలియచేశారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు ఆమె. ఇకనైనా వైసీపీ తీరు మార్చుకుంటే మంచిదని పేర్కొన్నారు సుజనా చౌదరి. ఆలపాటి రాజా మాట్లాడుతూ, ఏపీ పరిస్థితి ప్రస్తుతం అస్సలు బాలేదని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతుందేమోనన్న బాధ ఉందని వ్యక్తపరిచారు. ఏపీ లో ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వ్యక్తపరిచారు.