గాలోడు సినిమాతో సక్సెస్ అయిన సుధీర్.. లాభాల బాట పట్టిన మేకర్స్.!

-

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుడిగాలి సుధీర్.. అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకొని.. కొన్ని వందల స్కిట్స్ చేసి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యువతలో బీభత్సమైన గుర్తింపును సొంతం చేసుకున్న సుధీర్ ని అందరూ బుల్లితెర మెగాస్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఒక జబర్దస్త్ మాత్రమే కాదు ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో కూడా సందడి చేసిన సుధీర్ ఒకవైపు కమెడియన్ గా.. మరొకవైపు హోస్ట్ గా వ్యవహరించి ఆ తర్వాత వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇటీవల “సాఫ్ట్వేర్ సుధీర్” సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

- Advertisement -

ఇప్పుడు గాలోడు సినిమా ద్వారా చాలాకాలం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధీర్. ఈ సినిమాతో ఆయన సినీ కెరీర్ కు పెద్ద బ్రేక్ పడిందని చెప్పాలి. గాలోడు సినిమాతో నిర్మాతలకు లాభాల వర్షం కురుస్తోందని కూడా సమాచారం. మరి సినిమా లాభాల విషయానికి వస్తే… రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను.. సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు . ఇందులో హీరోయిన్ గా గెహనా సిప్పి నటించింది. నవంబర్ 18న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2.45 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఏడు రోజులు పూర్తయ్యేసరికి 6.38 కోట్ల గ్రాస్ కలెక్షన్ .. రూ.3.42 కోట్ల షేర్ వసూలు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి కంటే దాదాపు రూ. 50 లక్షలు అధికంగా లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా కొత్త సినిమాలు రాని నేపథ్యంలో థియేటర్లలోనే ప్రదర్శితమవుతున్న ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత లాభాలు పొందే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ సినిమా హీరోగా సుధీర్ కి మంచి బ్రేక్ ఇవ్వడమే కాకుండా నిర్మాతలకు కూడా లాభాలు అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...