వైసీపీలో వారసులకు సీట్లు..జగన్‌కు తప్పడం లేదు!

-

ఆ మధ్య వైసీపీ వర్క్ షాపులో గడపగడపకు కార్యక్రమంపై రివ్యూ చేసి ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్న జగన్..కొందరు ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లకుండా..తమ వారసులని నియోజకవర్గాల్లో తిప్పుతున్నారని, అలా చేయొద్దని, నేతలే డైరక్ట్ గా తిరగాలని స్పష్టం చేశారు. అలాగే ఏ వారసుడుకు కూడా సీటు ఇవ్వనని జగన్ తేల్చి చెప్పారు. మాజీ మంత్రి పేర్ని నాని బదులు ఆయన వారసుడు పేర్ని కృష్ణమూర్తి గడపగడపకు తిరుగుతున్నారనే నేపథ్యంలో జగన్ ఈ మాట చెప్పారు.

గడపగడపకు తన వారసుడు తిరుగుతున్నారని, తాను నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయనని, తన కుమారుడు పోటీ చేస్తారని పేర్ని..జగన్‌కు వివరించారు. ఆ సందర్భంలోనే ఏ వారసుడుకు సీటు లేదని, మీరే తనతో ఉండాలని కోరారు. అయితే జగన్ చెప్పడానికి చెప్పారు గాని..ఫీల్డ్ లోకి వచ్చేసరికి అది వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు తమ వారసుల్లోనే ఫీల్డ్ లో తిప్పుతున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ తమ వారసులకే సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.

ఎలాగో పేర్ని పోటీ చేయనని చెప్పేశారు. ఇటీవల గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా సైతం…నెక్స్ట్ పోటీ చేయనని తన కుమార్తె పోటీ చేస్తారని చెప్పారు. తాజాగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సైతం ఇటీవల వనభోజనాలు కార్యక్రమంలో.. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తననే పోటీ చేయాలని చెబితే ..తన వయసు ఇప్పుడు 83గా చెప్పుకొచ్చారు. గుండె జబ్బు ఉందని, ఎక్కువ సేపు మాట్లాడలేను..జనంలో తిరగలేను..పోటీ చేయలేనని చెప్పానని చెన్నకేశవ రెడ్డి వెల్లడించారు.

ఇక తన కుమారుడుకు జగన్ సీటు ఇచ్చే అంశం పైన సర్వే చేయిస్తున్నామని చెప్పారు. అటు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం తన వారసుడుని రంగంలోకి దించాలని చూస్తున్నారు..వీరే కాదు ఇంకా కొంతమంది సీనియర్లు తమ వారసులని రెడీ చేస్తున్నారు. ఎంత కాదు అనుకున్న కొంతమంది వారసులకు జగన్ సీటు ఇవ్వక తప్పని పరిస్తితి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news