సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఐపీఎల్ లో ఘోర ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే రాబోయే ఐపీఎల్ 2022 కి సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహాలను రచిస్తుంది. అందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండిస్ మాజీ క్రికటర్ బ్రియాన్ లారా ను ఎంపిక చేసింది. బ్రియాన్ లారా ప్రపంచ క్రికెట్ దిగ్గజాలలో ముందు వరసలో ఉంటారు. ఆయన అనుభవం జట్టు కు ఉపయోగపడుతుందని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం భావిస్తుంది. ఇప్పటికే బౌలింగ్ కోచ్ గా సన్ రైజర్స్ మాజీ అటగాడు డేల్ స్టెయిన్ ను తీసుకున్నారు.
అలాగే స్పీన్ బౌలింగ్ కోచ్ గా శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ ను కొనసాగిచడానికి నిర్ణయం తీసుకుంది. అలాగే గత సీజన్ లో డైరెక్టర్ గా ఉన్న టామ్ మూడీ ని మళ్లీ హెడ్ కోచ్ గా నియమించింది. కాగ గత సీజన్ లో హెడ్ కోచ్ గా ఉన్న ట్రెవర్ బేలిస్ ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించింది. అలాగే జట్టు లోనూ భారీ మార్పులు చేయడానికి సిద్ధ పడుతుంది. ఇప్పటి కే వార్నర్ తో పాటు రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లను వదిలేసుకుంది. కేన్ విలియమ్ సన్ తో పాటు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ లను మాత్రం రిటైన్ చేసుకుంది. కాగ వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ కప్ సాధించాలని సన్ రైజర్స్ వ్యూహాలను రచిస్తుంది.