మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “జిన్నా”. హీరోగా చెప్పుకోదగిన సక్సెస్ చూడని ఈ స్టార్ కిడ్ ఇప్పుడు జిన్నా అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మరోసారి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథా, స్క్రీన్ ప్లే, కోనా వెంకట్ అందించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం భాషలో రూపొందుతోంది.
ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటించారు. వాళ్ళిద్దరితో కలిసి ఈ జిన్నా మూవీ కోసం ప్రమోషన్ ఫుల్లుగా ప్లే చేస్తున్నారు మంచు విష్ణు. ఇటీవలే ఈ చిత్రం నుండి సన్నీలియోన్కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
దీనికి ఫుల్ రెస్పాండ్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో సన్నీలియోన్ ఫుల్ లెన్త్ రోల్ చేస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్ ని విడుదల చేశారు. అయితే.. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే.. సన్ని లియేనీ.. చమ్మక్ చంద్రకు హాగ్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.