భారత దేశంలో అతి పెద్ద లైఫ్ ఇన్స్యూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ వేర్వేరు వర్గాలకు తగ్గట్లు ఇన్స్యూరెన్స్ పాలసీలను అందిస్తుంది.పిల్లలకు, సీనియర్ సిటిజన్లకు, మహిళలకు వేర్వేరుగా ఇన్స్యూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. మహిళలు, ఆడపిల్లల కోసం ఎల్ఐసీ నుంచి ఓ ప్రత్యేక పాలసీ ఉంది. ఎల్ఐసీ ఆధార్ శిల ప్లాన్ పేరుతో ఈ పాలసీని అందిస్తోంది..
ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే..రోజుకు రూ.29 రూపాయల చొప్పున కడితే మెచ్యూరిటీ సమయంలో రూ.4,00,000 రిటర్న్స్ పొందొచ్చు. ఎల్ఐసీ అతితక్కువ ప్రీమియంతో అందిస్తున్న పాలసీల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ పాలసీ కేవలం మహిళలకు మాత్రమే. ఎల్ఐసీ ఆధార్ శిల ప్లాన్‌ను మహిళలు, ఆడపిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు..ఈ పాలసిని తీసుకొవాలంటే మీకు ఆధార్ తప్పనిసరిగా ఉండాలి.భారతదేశంలో దాదాపు అందరికీ ఆధార్ కార్డ్ లభించింది కాబట్టి మహిళలు, అమ్మాయిలు ఎవరైనా ఈ పాలసీ సులువుగా తీసుకోవచ్చు. ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకోవడానికి ఆరోగ్య పరీక్షలు కూడా అవసరం లేదు..
ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే కనీస వయస్సు 8 ఏళ్ల నుంచి గరిష్టంగా 55 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పాలసీకి అప్లై చేయొచ్చు. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల గడువుతో పాలసీ తీసుకోవాలి. ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీలో కనీసం రూ.75,000 సమ్ అష్యూర్డ్‌తో పాలసీ తీసుకోవచ్చు. గరిష్ట సమ్ అష్యూర్డ్ రూ.3,00,000. పాలసీహోల్డర్లు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది ఆప్షన్స్‌తో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది..
ఈ పాలసీని తీసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ చూస్తే..పాలసీ తీసుకున్న ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్‌కు 110 శాతం నామినీకి లభిస్తుంది. పాలసీహోల్డర్ ఐదేళ్ల తర్వాత మరణిస్తే సమ్ అష్యూర్డ్‌తో పాటు లాయల్టీ అడిషన్ లభిస్తుంది. ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకునేవారికి ఎల్ఐసీ యాక్సిడెంటల్ రైడర్, పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్, క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్స్ ఉంటాయి..
30 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ 20 ఏళ్ల కాలానికి ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం.ఏడాదికి రూ.10,585 చొప్పున ప్రీమియం చెల్లించాలి. అంటే రోజుకు రూ.29 చొప్పున చెల్లించాలి. పన్నులు కలిపి 20 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.2,14,696 అవుతుంది..పాలసీ పూర్తీ అయ్యే లోపు చేతికి రూ. 3,97,000 వరకు రిటర్న్స్ వస్తాయి..ప్రీమియం ను బట్టి ప్లాన్ లు అమలు అవుతాయి… మంచి లాభాలను పొందవచ్చు…