ఈ రోజు బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియాకు ఒక బ్యాడ్ న్యూస్ జరిగిన విషయం తెలిసిందే. బంగ్లా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ చేస్తున్న హార్దిక్ పాండ్యా కాళీ మడమ బెణకడంతో ఆ తరువాత బౌలింగ్ చేయలేక మైదానాన్ని వీడాడు. ఇప్పటి వరకు హార్దిక్ గాయం గురించి ఎటువంటి అప్డేట్ లేదు. కాగా హార్దిక్ పాండ్యా వేసిన మొదటి ఓవర్ లోనే మూడు బంతులు మాత్రమే వేసి వెళ్ళిపోయాడు. ఇక మిగిలిపోయిన మూడు బంతులను ఎవరికీ ఇవ్వాలి అనుకుంటున్న దశలో రోహిత్ కు కోహ్లీ గుర్తుకు వచ్చాడు. అప్పటికే ఓపెనర్లు మంచి ఫామ్ లో ఉన్నారు… హార్దిక్ వేసిన మూడు బంతుల్లో ఫోరు సిక్సు తో 10 పరుగులు పిండుకున్నారు. ఇక కోహ్లీ బౌలింగ్ మరో సిక్స్ ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీ చాలా నేర్పుగా బౌలింగ్ చేసి మూడు బంతులకు కేవలం పరుగులు మాత్రమే ఇచ్చాడు.. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది..
రెగ్యులర్ బౌలర్ గా ఉన్న హార్దిక్ పాండ్యా మూడు బంతులకు 10 పరుగులు ఇస్తే, ఎప్పుడో ఒకసారి బౌలింగ్ వేసే విరాట్ మాత్రం ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను క్రీజులో పెట్టుకుని కేవలం రేణుడి పరుగులే ఇచ్చాడు. విరాట్ బెటర్ హార్దిక్ కన్నా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.