రాజధాని అంశం.. ఏపీ సర్కార్ ఎస్‌ఎల్‌పీకి నంబర్‌ కేటాయించిన సుప్రీం

-

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్‌ఎల్‌పీ) ను దాఖలు చేసింది. ఈ ఎస్‌ఎల్‌పీకు సుప్రీం కోర్టు రిజిస్ట్రీ ఎస్‌ఎల్‌పీ నంబర్‌ కేటాయించింది. అమరావతే రాజధానిగా కొనసాగించాలని ఆరు నెలల్లో అభివృద్ధి చేసి చూపించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గత నెలలో ఏపీ సర్కారు 2వేల పేజీలతో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటిషన్‌పై ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకున్నాక రిజిస్ట్రీ ఎస్‌ఎల్‌పీ నంబర్‌ కేటాయించింది.

మరోవైపు సీజేఐ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం మరో పిటిషన్‌పై తుది వాదనలకు నిర్ణయించడంతో గురువారం అమరావతిపై ఏపీ ప్రభుత్వ ఎల్‌ఎస్‌పీ కేసు విచారణ జరిగే అవకాశం లేదు. ఈరోజు కుదరకపోతే రేపటికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. సీజేఐ ఎదుట మెన్షన్‌ చేసే పిటిషన్ల జాబితాలో చేర్చాలని రిజస్ట్రీని కోరారు.

ఈ కేసుకు సంబంధించి తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ అమరావతి రైతులు ఇప్పటికే కేవియట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులైన రైతులకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు ఎస్‌ఎల్‌పీ కాపీని ఆన్‌లైన్‌లో పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news